Home సినిమా వార్తలు ది వారియర్ కి DSP BGM మైనస్ అంటున్న ప్రేక్షకులు

ది వారియర్ కి DSP BGM మైనస్ అంటున్న ప్రేక్షకులు

Producers Hyping The Numbers Of The Warrior In All Areas

రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటించిన సినిమా “ది వారియర్”. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో బుల్లెట్టు పాట బ్లాక్ బస్టర్ అవగా.. టీజర్, ట్రైలర్ లు కూడా ఆకట్టుకుని భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదల అయింది.

అయితే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు మిశ్రమ స్పందన లభించింది. రివ్యూలు అంతగా బాగా లేకపోయినా.. కలెక్షన్స్ తొలి రోజు పరవాలేదు అనిపించాయి. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా సేఫ్ అవ్వాలి అంటే వారాంతంలో కలెక్షన్లు పెరగాలి లేదంటే నష్టాలు తప్పవు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ సంగీతానికి నెగటివ్ మార్కులు వేశారు ప్రేక్షకులు మరియు విమర్శకులు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఏమాత్రం బాగాలేదని, సినిమాకి ఉపయోగ పడాల్సిన చోట కూడా ఊపు తగ్గించేసి నిరాశ పర్చిందని సమాచారం.

ఒక వైపు భారీ వర్షాలు ఈ సినిమా ఓపెనింగ్స్ ను దెబ్బ తీయగా.. సినిమాలో బాగున్న సన్నివేశాలకు కూడా తన సంగీతంతో దేవిశ్రీప్రసాద్ సహాయం చేయలేకపోయాడు అని సోషల్ మీడియాలో ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. పాటల్లో క్యాచీ బీట్ ఉంచి రంజింప జేయటంలో దేవికి ఎవరూ సాటి లేరు. కానీ గత కొంతకాలంగా ఆయన పనితనంలోపదును తగ్గిందన్న మాట వాస్తవం.

ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆయన తన మునుపటి స్థాయికి తగ్గట్టుగా ఇవ్వలేకపొతున్నారు అని గత కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నాయి.మేజర్ తరువాత తెలుగులో హిట్ సినిమా లేదు..ఈ క్రమంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ అయిన ది వారియర్ హిట్ అయి చిత్ర పరిశ్రమకు ఊపిరి పోస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు కానీ తొలిరోజు వరకూ వారి ఆశలు నిజం అవ్వలేదు. మరి వారాంతంలో అయినా కలెక్షన్లు పిక్ అప్ అవుతాయి అని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version