Home సినిమా వార్తలు ‘కూలీ’ ఫైనల్ కట్ పై రజినీకాంత్ రెస్పాన్స్ ఇదే

‘కూలీ’ ఫైనల్ కట్ పై రజినీకాంత్ రెస్పాన్స్ ఇదే

coolie

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థపై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా మాస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమా కూలీ. ఈ సినిమాలో శృతిహాసన్ కీలకపాత్ర చేస్తుండగా ఇతర ముఖ్యపాత్రలని అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర తదితరులు చేస్తున్నారు.

ఇప్పటికే కూలీ నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ తో పాటు గ్లింప్స్ టీజర్స్ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 14న ఈ సినిమాని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా గురించి లోకేష్ కనకరాజ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సినిమా యొక్క అవుట్ ఫుట్ అయితే అదిరిపోయిందని ఓవరాల్ గా తామందరికీ సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలిగిందన్నారు. ఇక రీ రికార్డింగ్ సందర్భంగా సినిమా సినిమా ఫీల్ కట్ ని ప్రత్యేకంగా వీక్షించిన హీరో రజనీకాంత్ పూర్తిగా చూసిన అనంతరం తనని కౌగిలించుకొని అద్భుతంగా తీశామని మెచ్చుకున్నారని అన్నారు.

అది తనకి తలపతి మూమెంట్ ని అందించిందని చెప్పుకొచ్చారు లోకేష్. మొత్తంగా లోకే ష్ కనకరాజ్ చెప్పిన ఈ మాటలతో సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు. మరి రిలీజ్ అనంతరం కూలీ ఎంత మేర విజయవంతం అవుతుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version