Home సినిమా వార్తలు రూ. 100 కోట్లకు ‘కాంతారా’ తెలుగు రాష్ట్రాల హక్కులు ?

రూ. 100 కోట్లకు ‘కాంతారా’ తెలుగు రాష్ట్రాల హక్కులు ?

kantara

ఇటీవల మంచి అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ కాంతారా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడలో తెరకెక్కి అక్కడ విజయవంతం అయింది. అనంతరం దీనిని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ కాంతారా చాప్టర్ 1. ఈ మూవీలో రుక్మిణి వసంత్ కీలక పాత్ర చేస్తుండగా జయరాం, రాకేష్ పూజారి కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రముఖ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈమూవీని కూడా రిషబ్ శెట్టి తెరకెక్కిస్తూ ప్రధాన పాత్ర చేస్తున్నారు.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈమూవీ గాంధీజయంతి కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.100 కోట్లకు దగ్గరగా ఉన్నాయని టాక్. వీటిలో నైజాం రూ. 40 కోట్లు, కోస్టల్ ఆంధ్ర రూ. 45 కోట్లు, మరియు సీడెడ్ రూ.15 కోట్లు చెప్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ తెలుగు రాష్ట్రాలో రూ. 100 కోట్ల షేర్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మరి దీనిని బట్టి కాంతారా చాప్టర్ 1 మూవీ రైట్స్ రూ. 100 కోట్లకు కొనుగోలు చేయడానికి ఎంతవరకు బయ్యర్స్ కొనుగోలు చేయడానికి వస్తారో చూడాలి. అయితే మూవీ టీమ్ మాత్రం కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉందని అంటున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version