Home సినిమా వార్తలు ‘అఖండ – 2’ అనుకున్న డేట్ కి రావడం కష్టమేనా ?

‘అఖండ – 2’ అనుకున్న డేట్ కి రావడం కష్టమేనా ?

akhanda 2

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అఖండ 2.

నాలుగేళ్ళ క్రితం రిలీజ్ అయి ఎంతో పెద్ద విజయం అందుకున్న అఖండ కి సీక్వెల్ అయిన ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకునే బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

సంయుక్తా మీనన్, ప్రగ్య జైస్వాల్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు చేస్తున్న అఖండ 2 మూవీని సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ అనుకున్న టైంకి రిలీజ్ లేనట్లే అంటున్నారు. ఇక అదే డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ ల ఓజి మూవీ రిలీజ్ మాత్రం పక్కగా ఫిక్స్ అయింది. మొత్తంగా అఖండ 2 రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి పక్కా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version