అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో క్లీం ప్రొడక్షన్స్ నిర్మించగా ప్రముఖ అగ్ర కన్నడ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు సమర్పకులుగా వ్యవహరించారు.
అయితే మొదట చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుండి మెల్లగా సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కింది. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ డివోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా మాట అద్భుతం అంతే.
ముఖ్యంగా తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ నార్త్ లో మరింత బాగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తోంది. ఇప్పటికే రూ. 200 కోట్ల మార్క్ దాటి మరోవైపు ఇతర కొత్త సినిమాల రిలీజ్ యూ ఉన్నప్పటికీ కూడా రూ. 300 కోట్ల మార్క్ కి ఈ మూవీ పయనిస్తోంది.
అశ్విన్ కుమార్ ఆకట్టుకునే రీతిన తీసిన ఈ డివోషనల్ యానిమేషన్ మూవీలో శ్రీమహావిష్ణువు యొక్క వరాహావతారం తో పాటు క్లైమాక్స్ లో వచ్చే నరసింహావతారా సీన్స్ కి విపరీతంగా క్రేజ్ లభిస్తోంది. మరి ఈ మూవీ ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.