చిత్రం: మారీసన్
రేటింగ్: 3/5
తారాగణం: వడివేలు, ఫహద్ ఫాసిల్, కోవై సరళ, వివేక్ ప్రసన్న మరియు ఇతరులు
దర్శకుడు: సుధీష్ శంకర్
స్ట్రీమింగ్ ఆన్: నెట్‌ఫ్లిక్స్
తమిళ సీనియర్ నటుడు వదివేలు, మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా మూవీ మారీసన్. ఈ మూవీని యువ దర్శకుడు సుధీష్ శంకర్ తెరకెక్కించగా కీలక పాత్రల్లో కోవై సరళ, సితార, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ పై ఆర్ బి చౌదరి గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
దయ (ఫహాద్ ఫాసిల్) అనే దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ఒక దొంగతనం కేసులో జైలుకి వెళ్లి వచ్చే సమయంలో ఒక బైక్ ని దొంగిలించి వెళ్తున్న క్రమంలో ఒక ఇంటిని టార్గెట్ చేసి అక్కడ దొంగతనం చేయాలని చూసి, ఆ ఇంట్లో సంకెళ్లతో బందించి ఉన్న వేలాయుధం పిళ్ళై (వడివేలు)ని చూస్తాడు.
తనకి అల్జీమర్స్ వ్యాధి ఉండడంతో కొడుకు తనని సంకెళ్ళేసి బంధించాడని, కావున తనని విడిపిస్తే రూ. 25,000 ఇస్తానని దయని కోరతాడు. అందుకు అంగీకరించిన దయ అతడిని విడిపించడం, ఆపైన దయకి డబ్బు ఇవ్వడం కోసం ఏటీఎంక్కి వెళ్లి డబ్బు డ్రా చేసి ఇస్తాడు.
అదే సమంయంలో డబ్బు డ్రా చేస్తుండగా వేలాయుధం ఖాతాలో రూ. 25 లక్షలు ఉండడం బ్యాలెన్స్ చూసిన దయ ఎలాగైనా అతడిని మంచి చేసుకుని మెల్లగా ఆ డబ్బు దొంగిలించాలని భావించి అతడితో ముందుకు సాగుతాడు.
మరి ఆ క్రమంలో కథ ఏ విధంగా ముందుకు సాగింది. ఇంతకీ వేలాయుధాన్ని అసలు ఎవరు సంకెళ్లు వేసి బంధించారు, చివరికి అతడి వద్ద ఉన్న డబ్బుని దయా దొంగిలించాడా, మధ్యలో ఎటువంటి ఆసక్తికరమైన మలుపులు ఎదురయ్యాయి అనేది మొత్తం మూవీలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ఇక మూవీలో ప్రధాన పాత్రలు చేసిన వడివేలు, ఫహాద్ లపైనే ఈ మూవీ సాగుతుంది. ఆకట్టుకునే కథ, కథనాలతో సాగిన ఈ మూవీలో ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. కీలకమైన ఎమోషనల్ యాక్షన్ సీన్స్ లో అటు వడివేలు, ఇటు ఫహాద్ ఇద్దరూ కూడా హృద్యమైన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన కోవైసరళ, వివేక్ ప్రసన్న సహా అందరూ కూడా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
ముఖ్యంగా ఈ కథని ఆసక్తికర సన్నివేశాలు స్క్రీన్ ప్లే తో దర్శకుడు సుధీష్ శంకర్ ముందుకి నడిపారు. ఒక ఆసక్తికరమైన పాయింట్ తో ప్రారంభం అయిన ఈమూవీ మెల్లగా కథనంలో చిన్న చిన్న ట్విస్ట్ లతో సాగుతుంది. మొదట ఒకింత మెల్లగా సాగె కథనం, అక్కడి నుండి ఆసక్తికరంగా మలుపులతో అందరినీ అలరిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అనంతరం వచ్చే క్లైమాక్స్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్:
- వడివేలు – ఫహద్ ఫాసిల్ పెర్ఫార్మెన్స్
- మొదటి అర్ధభాగం
- భావోద్వేగ సన్నివేశాలు/సంభాషణలు
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
- నెమ్మదిగా సాగే వేగం
- రెండవ అర్ధభాగంలో కొన్ని ఊహించదగిన / సాగదీసిన సీన్స్
తీర్పు :
మొత్తంగా ఫహద్ ఫాసిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు సుధీష్ శంకర్ తీసిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మారీసన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రధాన పాత్రధారుల ఇద్దరి అద్భుత నటనతో పాటు కీలకమైన ఇంట్రెస్టింగ్ మలుపులు, ఎమోషనల్ సీఎంస్ వంటివి ఆకట్టుకుంటాయి. అయితే మధ్యలో కొంత కథనం నెమ్మదించినప్పటికీ ఓవరాల్ గా ఇది అందరినీ అలరించే మూవీ అని చెప్పకతప్పదు.