ఇటీవల ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా డాన్ 3 మూవీని గ్రాండ్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఒక వీడియో గ్లింప్స్ ద్వారా ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ వచ్చింది.
దానికి అందరి నుంచి విశేషమైనటువంటి రెస్పాన్స్ లభించింది. గత రెండు భాగాల కంటే కూడా దీన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించేందుకు దర్శకుడు అండ్ టీమ్ అయితే స్క్రిప్ట్ ని అదిరిపోయే రేంజ్ లో సిద్ధం చేశారట. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది.
ఈ సినిమాలోని ప్రధాన విలన్ పాత్ర కోసం మొదట టాలీవుడ్ యువనటుడు విజయ్ దేవరకొండ నటిస్తే బాగుంటుందని డాన్ 3 మూవీ టీమ్ ఆయనని అడిగిందట. అయితే తనకి ప్రస్తుతం నెగిటివ్ క్యారెక్టర్ చేసేటువంటి ఆలోచన లేదని సున్నితంగా ఆ అవకాశాన్ని తోసిపుచ్చారట హీరో విజయ్ దేవరకొండ.
ఈ సినిమాలో మొదట కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆమె స్థానంలోకి కృతి సనన్ వచ్చి చేరింది. 2026 లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయి బడ్జెట్ తో డాన్ 3 మూవీ రూపొందనుండగా దీనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్.