పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న గ్రాండ్ గా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు అటు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓజి సినిమాలు కూడా చేస్తున్నారు పవన్.
ఐతే ఓజీ సినిమా షూటింగ్ కూడా ఇటీవల పూర్తయింది. దీనిని సెప్టెంబర్ 25న దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది టీం. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే టాలీవుడ్ ని షేర్ చేస్తోంది. దాని ప్రకారం ఓజి మూవీ యొక్క ఓవరాల్ థియేటర్ రైట్స్ బిజినెస్ రూ. 350 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల యొక్క బిజినెస్ రూ. 170 కోట్లు రేంజ్ కాగా మొత్తంగా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 200 కోట్లు వరకు జరిగిందట ఈ విధంగా టోటల్ గా రూ. 350 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఓజి మూవీ తప్పకుండా భారీ స్థాయి విజయం సొంతం చేసుకోవడం ఖాయమని టీం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అందాల కథానాయిక ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా ఓజి మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం అంచనాలు ఎంత మేరకు అందుకుని ఈ మూవీ ఏ స్థాయి విజయవంతం అవుతుందో చూడాలి.