ఇటీవల సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త, అనంతరం విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ల మహాభినిష్క్రమణ వార్తలు మరువకముందే టాలీవుడ్ లో మరొక విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ స్టార్ నటుడు మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజగోపాల రాజు నిన్న రాత్రి హైదరాబాద్ లోని వారి స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ళ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దానితో రవితేజ కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రాజగోపాల రాజు మృతికి సంతాపం తెలియచేసారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ట్విట్టర్ లో పోస్ట్ ద్వారా రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇటువంటి రవితేజకు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్ధైర్యాన్ని అందించాలని కోరారు. పలువురి సందర్శన అనంతరం నేడు రాజగోపాల రాజు అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఆగష్టు 27న రిలీజ్ కానుంది. ఇక దీనితో పాటు కిషోర్ తిరుమలతో కూడా ఒక మూవీ చేస్తుండగా ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది