ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు నేడు తెల్లవారుఝామున అనారోగ్యంతో కన్నుమూశారు. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటుడిగా పరిచయం అయిన ప్రాణం ఖరీదు మూవీ ద్వారానే ఆయన కూడా చిత్రరంగ ప్రవేశం చేసారు.
ఇక అక్కడి నుండి అవకాశాలతో కొనసాగిన కోటకి జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, రజని జంటగా రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ అహనా పెళ్ళంట మూవీ విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది. ఆ మూవీలో ఆయన పోషించిన పిసినారి లక్ష్మీపతి పాత్ర ఇప్పటికీ ఎప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల మనస్సులో సుస్థిరంగా నిలిచిపోతుంది. మొత్తంగా తన కెరీర్ లో 750 కి పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు కోట.
ఇక నేడు ఆయన హఠాన్మరణం వార్త విన్న టాలీవడ్ పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. కాగా ఆ విషయం తెలిసిన వెంటనే పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కోట గారి ఇంటికి చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
కాగా కోట పార్థివదేహానికి నివాళులు అర్పించిన వారిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాబు మోహన్, వెంకటేష్, సురేష్ బాబు, రాజేంద్రప్రసాద్, ఆర్ నారాయణ మూర్తి, బ్రహ్మానందం ఉన్నారు. కాగా నేడు సాయంత్రం కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరుగనున్నాయి.