Home సినిమా వార్తలు ‘కింగ్డమ్’ తెలుగు వర్షన్ బ్రేకీవెన్ ఎంతంటే ?

‘కింగ్డమ్’ తెలుగు వర్షన్ బ్రేకీవెన్ ఎంతంటే ?

kingdom

విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్ ఒక సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న కింగ్డమ్ మూవీ జులై 31న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ బ్రేకీవెన్ షేర్ రూ. 50  రావాలి. కాగా ఈ మూవీ యొక్క నైజం రైట్స్ రూ. 15 కోట్లు, ఆంధ్రలోని 6 ఏరియాలు కలిపి రూ. రూ. 15 – 16 కోట్లు, సీడెడ్ రూ. 5.5 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 35 కోట్లు.

అలానే రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 5 కోట్లు, ఓవర్సీస్ రూ. 10 కోట్లు వెరసి తెలుగు వర్షన్ మొత్తంగా రూ. 50 కోట్లు బ్రేకీవెన్ రాబట్టాలి. మంచి బజ్ ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version