యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ల కలయికలో యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా గ్రాండ్ గా ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే నుండే నెగటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఆల్మోస్ట్ భారీ నష్టాల దిశగా ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుండి ఈ మూవీ భారీగా నెగటివిటీ మూటగట్టుకుంది. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్, స్టైల్ అంతా బాగున్నప్పటికీ కథ,కథనాల్లో భారీ లోపం మూవీ పై బాగా దెబ్బేసింది. దీనితో ఇకపై బాలీవుడ్ లో మన స్టార్స్ కంబోస్ వర్కౌట్ కావని అర్ధం అవుతోంది.
ఇటీవల ప్రభాస్ చేసిన బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ కూడా ఘోరంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఇటీవల డాన్ 3, ధూమ్ 4 వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రల అవకాశాలు వచ్చినప్పటికీ ఇక్కడి టైర్ 2 హీరోలు సైతం వాటిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో మార్కెట్ ని పెంచుకునేందుకు అక్కడి మూవీస్ చేస్తే తెలుగు ఆడియన్సు నుండి నెగటివిటీ ఎదుర్కోవాల్సి వస్తోందనే ఆలోచనతో వారు ఈ ఆఫర్స్ ని తిరస్కరించారు. మొత్తంగా ఇకపై స్టార్స్ కాంబోస్ కి కాలం చెల్లినట్లు అని పక్కాగా వార్ 2 రిజల్ట్ ని బట్టి తెలుస్తోంది.