Home సినిమా వార్తలు ‘వార్ – 2’ కి భారీ రన్ టైం ?

‘వార్ – 2’ కి భారీ రన్ టైం ?

war2

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కియారా అద్వానీ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. ఈ మూవీని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా దీనిని ఆగస్టు 14న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ ల పవర్ఫుల్ డైలాగ్స్ అదిరిపోవడంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.

అయితే ముఖ్యంగా విజువల్స్ తో పాటు విఎఫ్ఎక్స్ అంశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కేవలం పర్వాలేదనిపించింది. అయితే అదే రోజున కూలీ కూడా రిలీజ్ అవుతోంది. మరోవైపు కూలి కూడా రిలీజ్ కారణంగా అనేక ఏరియాస్ లో థియేటర్స్ షేరింగ్ ఉంటుంది.

తొలిసారిగా హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ యొక్క రన్ టైం 3 గం. ల 5 ని. లుగా ఉండనుందట. ఒకరకంగా ఎక్కువ రన్ టైంతో రానున్న ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ హైలైట్  కానున్న ఈ మూవీ మంచి విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version