ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తీసిన వార్ 2 తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన కూలీ సినిమాలు రెండూ కూడా ఒకేరోజున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే వీటిలో వార్ 2 మొదటి రోజు నుండి నెగటివ్ టాక్ సొంతం చేసుకోగా కోలీ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇక ఈ రెండు సినిమాల్లో కూలీ మూవీ ఓపెనింగ్స్ పరంగా రూ. 150 కోట్లమేర రాబట్టింది. ఇక ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అయితే పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా వార్ 2 అయితే చాలా చోట్ల చతికల పడగా కూలీ అక్కడక్కడా పర్వాలేదన్పిస్తోంది. ఇక అసలు విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాల యొక్క 8 రోజుల కలెక్షన్ పరిశీలిస్తే కూలీ రూ. 435 కోట్లని రాబట్టగా వార్ 2 మూవీ రూ. 302 కోట్లు రాబట్టింది. వీటిలో కూలీ మూవీ మొత్తంగా రూ. 600 కోట్లు రాబడితేనే బ్రేకీవెన్ ని చేరుకుంటుంది.
కాగా వార్ 2 మూవీ రూ. 700 కోట్లు బ్రేకీవెన్ రాబట్టాలి. ఇక ఈ రెండు సినిమాలు రెండవ వారం బాగానే పెర్ఫార్మ్ చేస్తాయేమో చూడాలని బయ్యర్స్ ఆశపడుతున్నారు. కూలీ ఓవరాల్ గా రూ. 500 కోట్ల లోపే ముగిసే అవకాశం ఉందని, అలానే వార్ 2 కూడా రూ. 400 కోట్ల మేర ముగుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి మొత్తం రన్ పూర్తి అయితేనే గాని పక్కాగా ఇవి ఎంతమేర లాభం లేదా నష్టం తెచ్చిపెట్టాయనేది చెప్పగలం.