మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 2006లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్టాలిన్. మెసేజ్ తో కూడిన డ్రామా మూవీగా రూపొందిన స్టాలిన్ లో త్రిష హీరోయిన్ గా నటించగా ఒక సాంగ్ లో మెగాస్టార్ ప్రక్కన స్టెప్పులు వేసింది అనుష్క శెట్టి.
ఇక ఈ మూవీ అప్పట్లో బాగానే విజయం అందుకోగా తాజాగా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా నేడు ఈ మూవీని గ్రాండ్ గా థియేటర్స్ లో రీ రిలీజ్ చేసారు. అయితే స్టాలిన్ మూవీ రీ రిలీజ్ లో ఏమాత్రం బజ్ అందుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ దిశగా కొనసాగుతోంది.
అక్కడక్కడా మాత్రమే పర్వాలేదనిపించేలా పెర్ఫార్మ్ చేస్తున్న స్టాలిన్ మూవీ ఓవరాల్ గా రీ రిలీజ్ లో డిజప్పాయింట్ చేసింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా కనిపించగా ఇతర కీలక పాత్రల్లో సీనియర్ నటి శారద, రవళి, ప్రదీప్ రావత్, సునీల్ తదితరులు నటించారు.
స్టాలిన్ సాంగ్స్ కూడా అప్పట్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు బ్యాక్ స్కోర్ ఇప్పటికీ కూడా మంచి క్రేజ్ కలిగి ఉంది.