Home సినిమా వార్తలు నాగ చైతన్య 25వ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తో ఫిక్స్ ?

నాగ చైతన్య 25వ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తో ఫిక్స్ ?

naga chaitanya

ఇటీవల చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య చేసిన మూవీ తండేల్. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్ సంస్థ పై బన్నీ వాసు దేనిని గ్రాండ్ గా నిర్మించారు అయితే రిలీజ్ అనంతరం మంచి విజయం అందుకుని హీరోగా నాగ చైతన్యకు మంచి పేరు తీసుకువచ్చింది తండేల్.

దీని అనంతరం ప్రస్తుతం విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తీక్ దండు తో నాగ చైతన్య చేస్తున్న 24 మూవీ వృష కర్మ. ఈ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. దీనిని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే అసలు విషయం ఏమిటంటే, దీని అనంతరం తన కెరీర్ 25వ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు నాగ చైతన్య సిద్దమైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇప్పటికే పలుమార్లు చైతన్యని కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కథ కథనాలు వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట కొరటాల. వాస్తవానికి ఎన్టీఆర్ తో దేవర 2 మూవీని కొరటాల చేయాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ మూవీ, నెల్సన్ మూవీతో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా ఉండడంతో కొన్నాళ్ళు దేవర 2 స్క్రిప్ట్ ని ప్రక్కన పెట్టి ఈలోపు చైతన్య తో చేసేందుకు సిద్దమయ్యారట కొరటాల. త్వరలోనే ఈ క్రేజీ కాంబో మూవీకి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు చెప్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version