Home సినిమా వార్తలు తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా రమేష్ బాబు కుమార్తె ఎంట్రీ ?

తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా రమేష్ బాబు కుమార్తె ఎంట్రీ ?

teja

టాలీవుడ్ లో చిత్రం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తేజ అప్పట్లో ఆ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తరువాత నువ్వు నేను, జయం, నిజం సినిమాలతో దర్శకుడు మంచి పేరు క్రేజ్ సొంతం చేసుకున్న తేజ, ఆపైన రాను రాను ఆశించిన స్థాయి సక్సెస్ లు అయితే అందుకోలేకపోయారు.

ఇటీవల రానా తమ్ముడు అభిరాం ని హీరోగా పెట్టి ఆయన తీసిన అహింస కూడా ఆడలేదు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం తేజ తన తదుపరి సినిమా ద్వారా తన పెద్ద కుమారుడు అమితోవ్ తేజని హీరోగా లాంచ్ చేస్తూ త్వరలో ఒక మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఇప్పటికే నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఆకట్టుకునే కథ, కథనాలు సిద్ధం చేసుకున్న తేజ త్వరలో దానిని పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నారట. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ ద్వారా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు దివంగత నటుడు, నిర్మాత అయిన ఘట్టమనేని రమేష్ బాబు కుమార్తె భారతి ని ఇందులో హీరోయిన్ గా తీసుకోనున్నారట.

అదే నిజం అయితే ఈ మూవీ ద్వారా ఆమె టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ కన్ఫర్మ్. త్వరలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ కానుందని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాబోయే అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని టాలీవుడ్ టాక్. మరి ఈ మూవీతో తేజ ఎంతమేర కెరీర్ పరంగా బ్రేక్ సొంతం చేసుకుంటారో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version