Home సినిమా వార్తలు జంజీర్ – ఆదిపురుష్ – వార్ 2

జంజీర్ – ఆదిపురుష్ – వార్ 2

prabhas ram charan jrntr

ఒకప్పటి తెలుగు హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ హిందీలో అక్కడక్కడా కొన్ని సినిమాలు చేసారు. అయితే ఇక్కడితో పోలిస్తే అక్కడ మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయారు. నటన పరంగా అక్కడి ఆడియన్స్ ని అలరించినప్పటికీ సక్సెస్ లు మాత్రం అంత బాగా సొంతం చేసుకోలేకపోయారు.

ఇక కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా రూపొందిన జంజీర్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అపూర్వ లఖియా తీసిన ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించారు. ఒకప్పటి అమితాబ్ జంజీర్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీ రిలీజ్ అనంతరం పరాజయం పాలవడంతో పాటు విపరీతమైన విమర్శలు ఎదుర్కొంది.

ఇక ఆ తరువాత ఇటీవల బాహుబలి తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇటీవల భారతీయ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ లో నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆ మూవీ కూడా పరాజయం పాలయింది.

ఇక తాజాగా బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ తీసిన వార్ 2 లో ఒక హీరోగా నటించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టడం కష్టంగా మారింది. ఆ విధంగా మన ప్రస్తుత తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్ మూవీస్ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నారు అని చెప్పకతప్పదు. ఈ విధంగా ముగ్గురు నటులకు చేదు అనుభవం ఎదురు కావడంతో ఇకపై తెలుగు స్టార్స్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేసే ఛాన్స్ దాదాపుగా తక్కువే అంటున్నాయి సినీ వర్గాలు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version