Home సినిమా వార్తలు బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా నితిన్ ‘తమ్ముడు’ 

బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా నితిన్ ‘తమ్ముడు’ 

thammudu

హీరో నితిన్ కెరీర్ పరంగా ప్రస్తుతం ఘోరమైన పరాజయాలని చవిచూస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ తమ్ముడు.

ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ తదితరులు కీలక పాత్రలు చేయగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీన్ని దాదాపుగా రూ. 75 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. దాదాపుగా చాలా ఏరియాల్లో ఫస్ట్ డే చాలా తక్కువ కలెక్షన్ తో పెర్ఫార్మ్ చేసిన తమ్ముడు మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 కోటి కంటే తక్కువ షేర్ దక్కించుకుంది.

ఇక థియేట్రికల్ బిజినెస్ పరంగా ఈ మూవీ రూ. 25 కోట్లని రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ యొక్క పరిస్థితి చూస్తే మొత్తంగా ఇది 15% కూడా రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు.

అయితే ఇటీవల ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, తమ్ముడు తప్పకుండా విజయం అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే ఈసారి కూడా ఆయన అంచనాలు తప్పి తమ్ముడు భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version