AIR రివ్యూ : ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ డ్రామా సిరీస్ 

    air series review

    వెబ్ సిరీస్ పేరు: AIR (ఆల్ ఇండియా ర్యాంకర్స్)

    రేటింగ్: 2.75 / 5

    తారాగణం: హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ, హర్ష చెముడు, రమణ భార్గవ్, చైతన్య రావు మాదాడి, జీవన్ కుమార్, సందీప్ రాజ్,
    అక్షర, సునీల్, తదితరులు

    దర్శకుడు: జోసెఫ్ క్లింటన్

    స్ట్రీమింగ్: ETV WIN లో

    యువ నటులు హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ డ్రామా సిరీస్ AIR. ఇటీవల ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ETV WIN లో ప్రసారం అవుతోంది. మరి ఈ సిరీస్ ఎంతమేరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంది అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం. 

    కథ

    ఈ సిరీస్ ముఖ్యంగా రాజు, అర్జున్, ఇమ్రాన్ అనే ముగ్గురు విజయవాడ AIR అకాడెమీలో ఐఐటి కోచింగ్ తీసుకునే విద్యార్థుల కథగా సాగుతుంది. ముందుగా ఫన్ రైడ్ గా మొదలైన ఈ సిరీస్ ఆ తరువాత కాలేజీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతూ వారు పలు ఛాలెంజెస్ ఎదుర్కొనేలా చేస్తుంది. అయితే వాటిని ఆ ముగ్గురు ఏవిధంగా ఎదుర్కొని బయటపడ్డారు అనేది మొత్తం ఈ సిరీస్ లో చూడాల్సిందే. 

    నటీనటుల పెర్ఫార్మన్స్

    కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్ ఈ మూవీలో కూడా తన మార్క్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంటాడు. అలానే ఇతర ఇద్దరు ప్రధాన పాత్రధారులు అయిన భానుప్రకాష్, జయాతీర్థ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో అలరించారు. లెక్చరర్ పాత్రలో నటుడు చైతన్య రావు ఆకట్టుకున్నారు.

    అలానే హర్ష చెముడు కూడా తన పాత్రలో కామెడీతో అలరించాడు. సమీర్, రమణ భార్గవ్ మరియు జీవన్ కుమార్ కూడా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు బాగా పెర్ఫార్మ్ చేసారు. సునీల్ పాత్రలో కామెడీ బాగుంటుంది, అలానే సందీప్ రాజ్ నెగటివ్ రోల్ కూడా అలరిస్తుంది. 

    విశ్లేషణ

    సందీప్ రాజ్ సమర్పణలో ఈ AIR సిరీస్ ని జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సిరీస్ లో విజయవాడ లో ఐఐటి కోచింగ్ తీసుకునే విద్యార్థుల యొక్క ఆలోచనలు నడవడికని ఎంటర్టైనింగ్ గా బాగా చూపించారు. మంచి కామెడీతో సాగె ఈ సిరీస్ లో ముగ్గురు యువకుల యొక్క ఐఐటి కోచింగ్ ప్రయాణంలోని అంశాలు వారు ఎదుర్కునే ఛాలెంజ్ లు బాగా ఆకట్టుకునే రీతిన ప్రజెంట్ చేసారు.

    అయితే మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు చివర్లో వారు ముగ్గురి మధ్య గల అనుబంధం ఎమోషనల్ సీన్స్ ని కూడా బాగా చూపించారు. కాగా కోచింగ్ సంస్థలు స్టూడెంట్స్ టాప్ ర్యాంక్స్ సాదించేందుకు ఏవిధంగా ఒత్తిడి చేస్తారు అనే అంశాలు యావరేజ్ గా చూపించారు. గతంలో వచ్చిన పలు సినిమాల్లోని సీన్స్ ని ఆల్మోస్ట్ అదేవిధంగా ఫాలో అయి ఈ సిరీస్ లో కూడా చూపించారు.

    అయితే ఈ సిరీస్ లో లెక్చరర్ గా కనిపించిన చైతన్య రావు పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది, అయితే ఆ పాత్రని ఆశించిన స్థాయిలో ప్రెజెంట్ చేయలేదు. స్టూడెంట్స్ తో కనెక్ట్ అయ్యే సీన్స్ ని సరిగ్గా రాసుకోలేదు. కొన్ని చోట్ల కథ ఎంతో స్లోగా సాగడంతో పాటు ముఖ్య కథాంశం చేరుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది, అలానే ఈ సిరీస్ లో చాలావరకు అనవసరపు సీన్స్ ఉన్నాయి. 

    ప్లస్ పాయింట్స్

    • నటీనటుల ప్రదర్శనలు
    • వినోదం
    • చివరి ఎపిసోడ్‌లు  

    మైనస్ పాయింట్స్

    • ఎలాంటి కొత్తదనం లేదు
    • తల్లిదండ్రులు – పిల్లల ట్రాక్ ఇంకా ఉంటే బాగుండేది
    • కొన్ని చోట్ల నెమ్మదిగా సాగె కథనం

    తీర్పు

    మొత్తంగా AIR (All India Rankers) సిరీస్ హృద్యంగా సాగె ఇంటర్ / హాస్టల్ విద్యార్థుల కథ పర్వాలేదనిపిస్తుంది. అయితే కథ పరంగా కొత్తదనం లేనప్పటికీ నటీనటుల పెర్ఫార్మన్స్ తో పాటు కొంత ఎంటర్టైనింగ్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version