Home సినిమా వార్తలు వెంకటేష్ మూవీలో అదే ఫార్ములా రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ 

వెంకటేష్ మూవీలో అదే ఫార్ములా రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ 

venkatesh trivikram movie

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ అనంతరం త్వరలో విక్టరీ వెంకటేష్ తో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. వాస్తవానికి అల్లు అర్జున్ తో ఆయన ఒక మైథలాజికల్ మూవీ చేయాల్సి ఉంది, కానీ అది ప్రస్తుతానికి డ్రాప్ అవడంతో పాటు ఆ ప్రాజక్ట్ ఎన్టీఆర్ తో త్వరలో చేయనున్నారు.

మధ్యలో ఈలోపు వెంకటేష్ తో మూవీ లైన్లో పెట్టారు త్రివిక్రమ్. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించనుండగా ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్. అలానే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాని ప్రకారం తన గత సినిమాల మాదిరిగా త్రివిక్రమ్ ఈ మూవీలో కూస్తో ఒక ఫార్ములా రిపీట్ చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఇక ఈమూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. కాగా ఆ హీరోయిన్స్ గా త్రిష, నిధి అగర్వాల్ నటించనున్నారని టాక్. అయితే దీనికి సంభవించి మేకర్స్ నుండి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version