పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో ఓజాస్ గంబీరగా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా ఆయనకు జోడీగా యువ అందాల నటి ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఓజి మూవీ నుండి తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టార్మ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతకముందు ఓజి ఫస్ట్ గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే, నేడు మూవీ నుండి హీరోయిన్ ప్రియాంక పోషిస్తున్న కన్మణి పాత్ర యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
ఆకట్టుకునే ట్రెడిషనల్ సారీ లుక్ లో ప్రియాంక పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా సెకండ్ సాంగ్ యొక్క ప్రోమోని త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తమన్ ట్వీట్ చేసాడు. తన అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఆడియన్సు అందరూ ఏవిధంగా అయితే చూడాలనుకున్నారో అంతకుమించి సుజిత్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టీమ్ అభిప్రాయపడుతోంది. మరి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన ఓజి సెప్టెంబర్ 25న రిలీజ్ అనంతరం ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.