ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించేందుకు పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలు ఆగష్టు 14న ఒకేరోజు గ్రాండ్ గా ఆడియన్సు ముందుకి వచ్చాయి.
ఇక ప్రస్తుతం ఈ రెండు థియేటర్స్ లో కొనసాగుతుండగా మరికొన్ని సినిమాలు తాజాగా ఓటిటి లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతి కృష్ణ తీసిన హరి హర వీర మల్లు మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాగా మరోవైపు ఇటీవల థియేటర్స్ లో సందడి చేసి మంచి విజయం అందుకున్న మేడం సార్ మూవీ కూడా అమెజాన్ ఓటిటి లో రిలీజ్ అయింది.
ఇక మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్, తమిళ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో రూపొందిన మారీసన్ కూడా నెట్ ఫ్లిక్స్ లో పలు భాషల ఆడియన్సు కి అందుబాటులోకి వచ్చింది. దగ్గుబాటి రానా సపోర్ట్ చేసిన కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. అలానే బాలీవుడ్ నటి కాజొల్ ప్రధాన పాత్ర చేఇస్నా మా కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
అలానే టామ్ షైన్ చాకో నటించిన సూతవాక్యం ఏ లవ్ స్టోరీ, ప్రేమకథ ఈటివి విన్ లో ప్రసారం అవుతున్నాయి. వీటితో పాటు లేటెస్ట్ హాలీవుడ్ సక్సెసుల్ మూవీ ఎఫ్ 1 అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాగా వీటిలో ఈవారం మాత్రం మేడం సార్, మారీసన్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి