Home బాక్సాఫీస్ వార్తలు ‘రెట్రో’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్ 

‘రెట్రో’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్ డీటెయిల్స్ 

retro

స్టార్ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రెట్రో. ఈ మూవీలో జాజు జార్జి, జయరాం, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేసారు.

2డి  ఎంటర్టైన్మెంట్స్,స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థల పై కార్తికేయన్ సంతానం, రాజేష్ పాండియన్ లతో కలిసి సూర్య, జ్యోతిక గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపించే టాక్ ని అందుకుంది. ఈ మూవీలో పారివేల్ కణ్ణన్ పాత్రలో మరొక్కసారి తన ఆకట్టుకునే నటనతో అందరినీ అలరించారు సూర్య.

ఇక ఈ మూవీ తెలుగులో కూడా డబ్ కాబడి రిలీజ్ అయింది. అయితే తమిళ్ తో పాటు తెలుగులో కూడా రెట్రో మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ రూ. 72 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఓవర్సీస్ లో రూ. 20 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, తమిళనాడులో రూ. 36 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5 కోట్లు, అలానే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని ఈ మొత్తాన్ని రాబట్టింది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క కలెక్షన్ పరిస్థితిని బట్టి చూస్తే ఓవరాల్ గా రూ. 100 కోట్ల మార్క్ వరకు మాత్రమే చేరుకునే అవకాశం కనపడుతోంది. అయితే కంగువ డిజాస్టర్ అనంతరం రెట్రో బాగా ఆడుతుందని భావించిన సూర్య ఫ్యాన్స్ ని ఈ మూవీ కేవలం పర్వాలేదనిపించేలా అలరించింది అంతే.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version