టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్స్ అందరూ కూడా వరుసగా పలు సినిమాలతో కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. అయితే వారిలో ఇటీవల కొందరు స్టార్స్ మంచి విజయాలతో దూసుకెళ్తుండగా మరికొందరు పర్వాలేదనిపించే సక్సెస్ లతో వెళ్తున్నారు. అయితే మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిలో నాచురల్ స్టార్ నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశ్వసనీయ నటులు అని చెప్పకతప్పదు.
ముఖ్యంగా ఎన్టీఆర్ మూవీ లైనప్ చూసుకుంటే పూరి జగన్నాథ్ తీసిన టెంపర్ మొదలుకుని నాన్నకు ప్రేమతో, జైలవకుశ, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర పార్ట్ 1 సినిమాలతో వరుసగా పలు సక్సెస్ లతో విజయఢంకా మ్రోగిస్తూ కొనసాగుతున్నారు.
గడచిన మొత్తం దాదాపుగా పదేళ్లలో ఎన్టీఆర్ నటించిన 7 సినిమాలు విజయవంతం అయ్యాయి. ఇక నాచురల్ స్టార్ నాని విషయానికి వస్తే, శ్యామసింగ రాయ్ మొదలుకుని అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో వరుసగా సక్సెస్ లు అందుకున్నారు నాని. ఇక ప్రస్తుతం నాని పేరుకిటాలీవుడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది.
ఆ విధంగా మంచి కంటెంట్స్ తో ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగా టాలీవుడ్ ఇతర టాప్ స్టార్స్ కూడా కంటెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తూ కొనసాగితే వారికి క్రేజ్, మార్కెట్ పెరగడంతో పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి కూడా అది మరింత మేలు చేస్తుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.