కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా డ్రాగన్. ఈ మూవీ తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక గడచిన మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు ఈ సినిమా మరింత స్ట్రాంగ్ గా అయితే కలెక్షన్స్ అందుకుంది.
మొదటి వీకెండ్ కి ఈ సినిమా ఓపెనింగ్ తో పోలిస్తే 80 శాతానికి పైగా కలెక్షన్ అయితే అందుకుంది. మొత్తం ఇది రూ. 4. 50 కోట్లని నాలుగో రోజు రాబట్టింది. ఇటు తెలుగు స్టేట్స్ లో కూడా రూ. 1 గ్రాస్ కలెక్షన్ అందుకున్నట్టు ఇక్కడ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ అద్భుత నటనతో పాటు దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన కథ కథనాలు, కామెడీ, లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్స్ ఈ సినిమాకి ప్రధాన బలాలుగా చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ. 50 కోట్ల గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో ఇది రూ. 58 కోట్ల గ్రాస్ దక్కించుకుంది. ఇక రేపు మహాశివరాత్రి పండుగ హాలిడే కావటంతో డ్రాగన్ మూవీకి మరింతగా కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
ఫస్ట్ వీక్ లో ఈ సినిమా టోటల్ గా రూ. 80 కోట్ల దాటేసి ఓవరాల్ గా రెండో వారంలో అడుగుపెట్టిన మధ్యలోనే రూ. 100 కోట్లు అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ రూ. 100 నుంచి రూ. 150 కోట్లకు కూడా చేరుకోవచ్చని తమిళ ట్రేడ్ అండ్ అనలిస్టులు చెప్తున్నారు