Home సినిమా వార్తలు Indian 3 Starts Very Soon త్వరలో సెట్స్ మీదకు కమల్ ‘ఇండియన్ – 3’

Indian 3 Starts Very Soon త్వరలో సెట్స్ మీదకు కమల్ ‘ఇండియన్ – 3’

indian 3

ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఘోరపరాజయలతో దర్శకుడుగా శంకర్ ఒకంత కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 మూవీ రూపొందగా దీనికి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. 

ఆ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక మొన్నటి సంక్రాంతి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన గేమ్ చేజర్ మూవీ రిలీజ్ అయి అది కూడా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దానితో ప్రస్తుతం ఇండియన్ 2 సీక్వెల్ అయిన ఇండియన్ 3 పై అందరూ అంచనాలు పెంచుకున్నారు. ముఖ్యంగా శంకర్ ఈ సినిమాని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా తీస్తున్నారట. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా 80 శాతం వరకు షూటింగ్ పూర్తికాగా మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోనున్నారట. అలానే ఇప్పటివరకు దీనికి కూడా బడ్జెట్ బాగానే అవడంతో ఇకపై ఎక్కువ ఖర్చు చేయకుండా మిగిలిన భాగం రూఒపొందనుందట. ముఖ్యంగా అసలు విషయం ఏమిటంటే ఇండియన్ 2 మూవీ ని మొదట రూ. 250 కోట్లతో ఒక్క ప్రాజెక్టుగా ముగిద్దాం అనుకున్నారట. 

అయితే ఫుటేజ్ మరింతగా పెరగటంతో దీన్ని ఇండియన్ 3 గా కూడా మలిచారట. మొత్తంగా అయితే ఇండియన్ 3 మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా తప్పకుండా దీన్ని విజయవంతం చేసేలా దర్శకుడు శంకర్ తో పాటు ఆయన టీం కూడా కసరత్తులు చేస్తుందట. మరోవైపు కమల్ కూడా ఈ సినిమా విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నారని చెప్తున్నారు

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version