నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తాజాగా తెరకెకుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. హిట్ సిరీస్ లో భాగంగా గతంలో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. హిట్ 1 లో విశ్వక్సేన్, హిట్ 2లో అడివి శేష్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ మూవీలో కేజిఎఫ్ సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.
యూనానిమస్ ప్రొడక్షన్స్ తో పాటు తన సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమా సంస్థతో కలిసి నాని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ టీజర్ లో నాని పవర్ ఫుల్ లుక్స్ తో పాటు వైలెన్స్ అంశాలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా అయితే టీజర్ 17 మిలియన్లకు పైగా 24 గంటల్లో వ్యూస్ సొంతం చేసుకొని ప్రస్తుతం 24 మిలియన్స్ వరకు చేరుకొని యూట్యూబ్లో టాప్ స్థానంలో కొనసాగుతుంది. ముఖ్యంగా టీజర్ లో బాగా వైలెన్స్ బట్టి చూస్తే సినిమా ఓవరాల్ అవుట్ పుట్ అనంతరం సెన్సార్ వారి నుండి A రేటింగ్ అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సెన్సార్ వారు ఖచ్చితంగా దీనికి A రేటింగ్ ఇస్తారని పలువురు ఆడియన్స్ కూడా అంటున్నారు.
ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండటంతో పాటు వైలెంట్ గా ఉంటుందని టీజర్ ను బట్టి చెప్పవచ్చు. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు నాని ఫాన్స్ ని అలరించేలా యాక్షన్ అంశాలతో దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెబుతోంది టీమ్. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.