టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతి వస్తున్నాం. యువ అందాల కథానాయికలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ కు నటించిన ఈ మూవీకి భీమ్ సిసిలోరియో సంగీతం అందించగా వరుస సినిమాల విజయాలతో దూసుకెళుతున్న యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కించారు.
కామెడీతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ గా రూపొందిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ఇతర కీలక పాత్రల్లో సాయికుమార్, నరేష్, మాస్టర్ రేవంత్, పృథ్వీ కనిపించారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ రూ. 250 కోట్లకు పై గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని కెరీర్ పరంగా వెంకటేష్ కి బిగ్గెస్ట్ హిట్ ని అందించింది.
అలానే ఈ స్థాయి కలెక్షన్లు అందుకున్న సీనియర్ తొలి స్టార్ హీరోగా నిలిచారు విక్టరీ వెంకటేష్. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే చాలా ఏరియాలో ఇంకా మంచి కలెక్షన్లతో కొనసాగుతూ ఉండటంతో ఓవరాల్ గా ఇది రూ. 300 కోట్ల వరకు చేరుకునే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం ఏ స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్ ని కొల్లగొడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి.