Home సినిమా వార్తలు పోస్ట్ పోన్ కానున్న ‘ది రాజా సాబ్’ ?

పోస్ట్ పోన్ కానున్న ‘ది రాజా సాబ్’ ?

the raja saab

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్ కూడా ఒకటి. ఈ మూవీని యువ దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తుండగా రద్దీ కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల ది రాజా సాబ్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ మంచి అంచనాలు అందుకున్నప్పటికీ ఆ తరువాత వచ్చిన మోషన్ పోస్టర్ పై మాత్రం విమర్శలు వచ్చాయి.

అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు మారుతీ ఈ మూవీని ఆకట్టుకునే రీతిన తెరకెక్కిస్తున్నట్లు టీమ్ చెప్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని ప్రముఖ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గ్రాండ్ గా నిర్మిస్తోంది. అయితే విషయం ఏమిటంటే, త్వరలోనే ఆడియన్స్ ముందుకి వస్తుందనుకున్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సినిమాలో కీలకమైన విఎఫ్ఎక్స్ విషయంలో టీమ్ మరింత శ్రద్ధ తీసుకుంటోందని అదే ఆలస్యానికి ఒకింత కారణం అని అంటున్నారు. మరోవైపు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇప్పటికే అఖండ 2, వార్ 2, ఓజి, విశ్వంభర, కూలీ, కాంతారా 2 వంటి భారీ సినిమాలు రిలీజ్ బెర్త్ లు ఆల్మోస్ట్ ఖాయం చేసుకున్నాయి. దానితో తమ మూవీని హడావుడిగా రిలీజ్ చేయాలనే ఆలోచన ది రాజా సాబ్ టీమ్ కి లేదట. పక్కాగా మంచి క్వాలిటీ ఔట్పుట్ తోనే మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువస్తారట.

దీన్ని బట్టి ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్. ఐతే అప్పటికే మెగాస్టార్ అనిల్ రావిపూడి మూవీతో పాటు మరొక రెండు సినిమాలు రిలీజ్ కానుండడంతో ఈ విషయమై ది రాజా సాబ్ టీమ్ ఆలోచన చేసి త్వరలో రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version