సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా సీక్వెల్స్ కాలం నడుస్తోంది. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి 2 అప్పట్లో ;;అతి పెద్ద సంచలన విజయం అందుకోవడంతో ఈ సీక్వెల్స్ ఆలోచన సౌత్ సినిమాలని తీసే వారి మనసులో పడింది.
ఆ తరువాత నుండి సౌత్ లో వచ్చిన సౌత్ సీక్వెల్స్ లో దాదాపుగా అన్ని కూడా భారీ విజయాలు సొంతం చేసుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో వచ్చిన పుష్ప 2 అతి పెద్ద విజయం అందుకుంది. ఇక తమిళ్ లో రోబో 2, కన్నడ లో కెజిఎఫ్ 2 తో పాటు ఇటీవల మలయాళంలో వచ్చిన ఎంపురాన్ (లూసిఫర్ 2) కూడా పెద్ద ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్నాయి.
ఈ విజయాలు ఇచ్చిన ఊపుతో మన సౌత్ లో మరికొన్ని సీక్వెల్స్ సినిమాలు మరింత గ్రాండ్ గా రూపొందుతో త్వరలో ఆడియన్స్ ముకఁడుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో కల్కి 2, దేవర 2, సర్ధార్ 2, ఖైదీ 2, జైలర్ 2, సలార్ 2, పుష్ప 3, కాంతారా 2, కెజిఎఫ్ 3 వంటి సినిమాలు ఉన్నాయి.
మొత్తంగా అయితే సీక్వెల్స్ హైప్ అటు ఆడియన్స్ లో కూడా ఎంతో ఉండడంతో దానిని క్రేజీ గా క్యాష్ చేసుకునేందుకు సినీ నిర్మాతలు, దర్శకులు తమ తమ సినిమాలని గ్రాండ్ గా తీసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లే చేస్తున్నారు. మరి రానున్న ఈ సీక్వెల్స్ లో ఏ ఏ సినిమాలు ఎంతమేర ఆకట్టుకుంటాయనేది చూడాలి.