ఇటీవల డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుని నటుడిగా తనకంటూ ఆడియన్స్ లో మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మూవీ జాక్.
ఈ మూవీలో యువ అందాల కథానాయిక వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ మూవీని ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తునారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ పర్వాలేదనిపించగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
ముఖ్యంగా తన సినిమాల్లో లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని దృష్టిలోపెట్టుకుని తెరకెక్కించే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, జాక్ విషయంలో మాత్రం ఒకింత రిస్క్ చేసి రా, ఇంటెలిజెన్స్ యాక్షన్ అంశాలు ప్రధానంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జాక్ ట్రైలర్ ని బట్టి మనం అది అర్ధం చేసుకోవచ్చు.
ట్రైలర్ లో సిద్దు మార్క్ డైలాగ్స్ తో పాటు యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు బాగానే ఉన్నాయి. విజువల్స్ తో పాటు ఛేజింగ్, ఫైట్ సీన్స్ వంటివి ట్రైలర్ లో ఆకట్టుకుంటాయి. మొత్తంగా బాగానే ఉన్న జాక్ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ విధమైన కొత్త రిస్క్ తో భాస్కర్ ఎంతమేర విజయం అందుకుంటారో చూడాలి.