తాజాగా బాలీవుడ్ లో విక్కీ కౌశల్ హీరోగా చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఛావా. చత్రపతి శివాజీ మరణం అనంతరం ఔరంగజేబు ఆయన సామ్రాజ్యం పై దండెత్తటం అదే సమయంలో శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ అడ్డుపడి అతడిని ప్రతిఘటించడం అనే అంశాన్ని తీసుకొని ఆకట్టుకునే రీతిన తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అందరిని ఎంతో ఆకట్టుకుంటుంది.
వాస్తవానికి చావా మూవీ పుష్ప 2 సమయంలోనే రిలీజ్ కావాల్సి ఉంది అయితే సినిమాను అప్పట్లో వాయిదా వేసి ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. దానితో అటు పుష్ప 2 కి బాగా కలిసి వచ్చింది, ఇక తాజాగా ఛావాకు కూడా అది బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. పుష్ప 2 మూవీ నార్త్ లో ఓవరాల్ గా రూ. 740 కోట్ల నెట్ కలెక్షన్ ను సొంతం చేసుకుంది.
ఇప్పటికే మరోవైపు ఛావా మూవీ ఐదు రోజుల్లో మొత్తంగా రూ.155 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఛావా మూవీకి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఇది ఓవరాల్ గా అక్కడ భారీస్థాయిలో కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా అటు పుష్ప 2 సమయంలో రిలీజ్ వాయిదా వేయడంతో అటు ఆ మూవీకి ఇటు ఛావా మూవీకి కలిసొచ్చిన అంశం. ఈ విధంగా ఒక పోస్ట్ పోన్మెంట్ వలన డబుల్ విజయం దక్కాయని చెప్పాలి.