Home సినిమా వార్తలు is skn criticism about that young actress ఎస్ కె ఎన్ విమర్శలు ఆ...

is skn criticism about that young actress ఎస్ కె ఎన్ విమర్శలు ఆ యువ నటిని ఉద్దేశించేనా ?

skn

ప్రస్తుతం టాలీవుడ్ లో యువ నిర్మాతగా మంచి పేరు క్రేజ్ కొనసాగుతున్న వారిలో శ్రీనివాస కుమార్ (ఎస్ కె ఎన్) కూడా ఒకరు. మొదటి నుంచి కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగినశ్రీనివాస్ కుమార్ చేసే కొన్ని వ్యాఖ్యలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. విషయం ఏమిటంటే తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ తెలుగు వర్షన్ అయిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. 

ఈ ఈవెంట్లో శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ మేము తెలుగు కంటే ఇతర భాష హీరోయిన్లనే ఎక్కువ ఇష్టపడతాం, ఎందుకంటె తెలుగు హీరోయిన్స్ కి ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం వలన కల్గిన అనుభవం మాకు అందరికీ తెలుసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

ఇక ఆయన ఈ వ్యాఖ్యలను ప్రత్యేకంగా వైష్ణవి చైతన్య ని టార్గెట్ చేస్తూ చేశారని అంటున్నారు పలువురు నెటిజన్స్. ఇటీవల ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందిన బేబీ మూవీ పెద్ద విజయం అందుకుంది. ఈ మూవీతో హీరోయిన్ గా వైష్ణవి మంచి క్రేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. 

అయితే బేబీ విజయం అనంతరం అదే టీమ్ తో వైష్ణవి హీరోయిన్ గా ఎస్ కె ఎన్ మరియు సాయి రాజేష్ మరొక ప్రాజక్ట్ అనౌన్స్ చేసారు, కానీ అది పట్టాలెక్కలేదు. దానితో ఎస్ కె ఎన్ ఒకింత ఇబ్బంది పడ్డారని, అందుకే ఈ వ్యాఖ్యలని వైష్ణవిని ఉద్దేశించి చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆయన వ్యాఖ్యలు మున్ముందు ఏ విధంగా పరిణమిస్తాయో, ఎవరెవరు వీటిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version