Home సినిమా వార్తలు Those Two Stars Acting without Remuneration for Kannappa says Vishnu కన్నప్ప లో...

Those Two Stars Acting without Remuneration for Kannappa says Vishnu కన్నప్ప లో ఆ ఇద్దరు స్టార్స్ రెమ్యునరేషన్ లేకుండా నటిస్తున్నారు : మంచు విష్ణు

manchu vishnu

ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ యాక్షన్ మూవీ కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా స్వయంగా తన సొంత సంస్థలైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్ పై భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో దీనిని నిర్మిస్తున్నారు విష్ణు. 

మంచు మోహన్ బాబుతో పాటు ప్రభాస్, కాజల్, అక్షయ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల సహా మరికొందరు పలువురు భారతీయ సినిమా పరిశ్రమలోని పలు భాషల నటులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఫస్ట్  మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

విషయం ఏమిటంటే, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ మూవీ హీరో మరియు నిర్మాత అయిన మంచు విష్ణు మాట్లాడుతూ, ఈ మూవీలో నటిస్తున్న ప్రభాస్, మోహన్ లాల్ ఇద్దరూ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా, తన తండ్రి మోహన్ బాబు పై ప్రేమతోనే వారు మూవీ చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25న పలు  రానున్న కన్నప్ప పెద్ద విజయం అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసారు విష్ణు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version