పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, యాక్షన్ హిస్టారికల్ ఎంటర్టైనర్ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా భారీ స్థాయిలో దీనిని పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా తాజాగా ఈ మూవీ నుండి ప్రభాస్ లుక్ బయటకు వచ్చింది.
విషయం ఏమిటంటే ఫౌజీ లో ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా ప్రభాస్ తో కలిసి ఫౌజీ సెట్స్ నుండి దిగిన పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కాగా అందులో ప్రభాస్ లుక్ గమనిస్తే స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని ఉండడం చూడవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ లుక్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.