యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ కింగ్‌డమ్. యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై ప్రతిష్టాత్మకంగా సాయి సౌజన్య, నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు టీజర్ ని నేడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు. కాగా తెలుగు టీజర్ కి ఎన్టీఆర్, తమిళ్ కి సూర్య, హిందీ కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్స్, యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.
అందరి నుండి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న ఈ యాక్షన్ టీజర్ తో విజయ్ గర్వపడేలా చేసాడని, ప్రతిసారి అతడు ఏదో ఒక సరికొత్త మెంటల్ అంశంతో అందరి ముందుకి వస్తాడని కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు రష్మిక మందన్న. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న కింగ్‌డమ్ మూవీని మే 30న అన్ని కార్యక్రమాలు ముగించి గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.