Home సినిమా వార్తలు Ram Charan was Like My Son says Allu Aravind చరణ్ నాకు కన్నబిడ్డ...

Ram Charan was Like My Son says Allu Aravind చరణ్ నాకు కన్నబిడ్డ లాంటి వాడు : అల్లు అరవింద్ 

allu aravind

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ తాజాగా అక్కినేని నాగ చైతన్యతో తండేల్ వంటి సక్సెఫుల్ మూవీ నిర్మించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని చందూ మొండేటి తెరక్కించగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.

అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫస్ట్ డే నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రస్తుతం కొనసాగుతోంది. ఐతే ఇటీవల ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు ని ఉద్దేశించి అటు సంక్రాంతికి వస్తున్నాం ని పొగుడుతూ, గేమ్ ఛేంజర్ ని తగ్గిస్తూ ఒకింత పరోక్ష విమర్శలుచేసారు అల్లు అరవింద్.

అయితే తాజాగా నేడు తండేల్ మీట్ లో భాగంగా దానిపై క్లారిటీ ఇచ్చారు. ఆ రోజున నేను మాట్లాడిన మాటలకు పలువురు మెగా ఫ్యాన్స్ ఆవేదనకు లోనయ్యారు. దిల్ రాజుని అడ్డంపెట్టుకుని రాంచరణ్ ని తగ్గించాను అని నన్ను ట్రోల్ చేశారు.

నిజానికి చరణ్ నాకు ఉన్న ఏకైక మేనల్లుడు అలానే నా కొడుకు లాంటోడు. నాకు తనకి మధ్య ఎప్పటినుండో ఓ మంచి అనుబంధం ఉందని అన్నారు. నిజానికి తనకు చరణ్ ని కానీ గేమ్ ఛేంజర్ మూవీని కానీ తగ్గించి మాట్లాడాలనే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version