కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ తాజాగా మగిళ్ తిరుమేణి తెరకెక్కించిన విడాముయార్చి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
ఈ మూవీని తెలుగులో పట్టుదల టైటిల్ తో రిలీజ్ చేసారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం సమకూర్చగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై భారీ సుభాస్కరన్ దీనిని నిర్మించారు. అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించిన విడాముయార్చి మూవీ మొదటి రోజు మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.
తెలుగులో అంతగా కలెక్షన్ రాబట్టని ఈ మూవీ ఫస్ట్ డే తమిళనాడులో భారీగా ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండవ రోజు కూడా మంచిగా రాబట్టిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి టోటల్ వరల్డ్ వైడ్ రూ. 115 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.
ఇక గడచిన మూడు రోజుల్లో ఈ మూవీ తమిళనాడులో రూ. 64-65 కోట్లని, అలానే ఆల్ ఇండియా రూ. రూ. 78 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ గ్రాస్ రూ. 37 కోట్లు కాగా మొత్తంగా కలిపి రూ. 115 కోట్లు రాబట్టింది.
కాగా ఈ మూవీ ఇంకా మరొక రూ. 100 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. 1997లో వచ్చిన అమెరికన్ మూవీ బ్రేక్ డౌన్ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంతమేర రాబడుతుందో చూడాలి.