ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా సుకుమార్ తెరకెక్కించారు.
మొన్న జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా త్వరలో పుష్ప 3 కూడా ఉంటుందని అయితే దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు అల్లు అర్జున్. ఇక దీని అనంతరం ఇప్పటికే గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించనున్న గ్రాండ్ పాన్ ఇండియన్ మూవీకి పచ్చ జెండా ఊపారు.
ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈమూవీ ఈ ఏడాదిలోనే పట్టాలెక్కనుంది. అయితే దీని తరువాత తమిళ యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీతో కూడా ఒక మూవీ చేయనున్నారు అల్లు అర్జున్.
ప్రముఖ కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ ప్రకటన త్వరలో రానుండగా దీనికి మొదట అనిరుద్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ తాజాగా ఆయన ప్లస్ లో ప్రస్తుతం సూర్య 45కి వర్క్ చేస్తున్న యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ వచ్చారు. అతడిని టీమ్ ఫైనల్ చేసినట్లు చెప్తున్నారు. అయితే దీని పై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.