Home సినిమా వార్తలు Boyapati next Movie with Naga Chaitanya నాగ చైతన్యతో మూవీ తీయనున్న బోయపాటి ?

Boyapati next Movie with Naga Chaitanya నాగ చైతన్యతో మూవీ తీయనున్న బోయపాటి ?

naga chaitanya

మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా తెరకెక్కిన భద్ర మూవీ ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఎంట్రీ ఇచ్చారు. 

అప్పట్లో ఈ మూవీ విజయం అనంతరం అక్కడి నుండి వరుసగా పలు సక్సెస్ఫుల్ ప్రాజక్ట్ చేసిన బోయపాటి, మధ్యలో పలు ఫ్లాప్ లని కూడా చవి చూసారు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ తో బోయపాటి తీసిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఎంతో భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి . 

ఇక వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతోంది. దీనిని ఈ ఏడాది అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా తండేల్ మూవీతో కెరీర్ పరంగా పెద్ద విజయం అందుకున్న అక్కినేని నాగ చైతన్యతో త్వరలో బోయపాటి శ్రీను ఒక మూవీ తీయనున్నారని అంటున్నారు. 

ఈ మూవీని గీత ఆర్ట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక్ దండుతో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నారు నాగ చైతన్య. అటు అఖండ2 అనంతరం చైతన్య ప్రాజక్ట్ పై పూర్తిగా పని ప్రారంభిస్తారట బోయపాటి. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version