మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, అంజలి, సముద్రఖని నటించారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించగా థమన్ సంగీతం సమకూర్చారు.
శంకర్ మార్క్ టేకింగ్ పూర్తిగా మిస్ అవడంతో పాటు పూర్తిగా పాత పంథాలో సాగిన కథ, ఏమాత్రం ఆకట్టుకోని కథనాలు ఈ మూవీకి ప్రధాన మైనస్ లు. విషయం ఏమిటంటే, తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది.
అత్యంత భారీ ఖర్చుతో రూపొందిన ఈ మూవీ ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద అత్యల్ప కలెక్షన్ మాత్రమే సొంతం చేసుకుని అటు నిర్మాత దిల్ రాజుకి అలానే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు చవిచూసేలా చేసింది. మరి ఓటిటి లో ఈ మూవీకి ఎంత మేర ఆడియన్స్ యొక్క మెప్పు లభిస్తుందో చూడాలి.