యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీని భారీ స్థాయిలో గీత ఆర్ట్స్ సంస్థ పై బన్నీ వారు నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.
మొదటి నుండి అందరిలో మంచి హైప్ కల్గిన తండేల్ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి బజ్ ఏర్పరిచింది.
ఇక నేడు గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన తండేల్ యొక్క ప్రీమియర్స్ టాక్ ని ఇప్పుడు చూద్దాం. కాగా ఈ మూవీ చూసిన మెజారిటీ ఆడియన్స్ పాజిటివ్ టాక్ చెప్తున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి, నాగ చైతన్య ల పెర్ఫార్మన్స్ తో పాటు దేవిశ్రీ అందించిన సాంగ్స్, చందూ మొండేటి టేకింగ్, ప్రొడక్షన్ వలుఎస్ బాగున్నాయని అంటున్నారు.
అక్కడక్కడా కొన్ని డల్ సీన్స్ ఉన్నప్పటికీ కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్ అయితే బాగా కుదిరాయని చెప్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఎపిసోడ్ బాగా ఉందని, ఓవరాల్ గా తండేల్ కి వారు మంచి మార్కులు వేస్తున్నారు. మరి నేటి నుండి ఈ మూవీ ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.