Home సినిమా వార్తలు Jailer 2 much more Grandeur ‘జైలర్ 2’ మరింత గ్రాండియర్ గా

Jailer 2 much more Grandeur ‘జైలర్ 2’ మరింత గ్రాండియర్ గా

jailer 2

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ జైలర్. ఈ మూవీలో రజినీకాంత్ సూపర్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ అయితే లభించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో మెరిసిన ఈ మూవీలో తమన్నా కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. 

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క సీక్వెల్ అయిన జైలర్ 2 అనౌన్స్ అయి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు నెల్సన్ దీని యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. కాగా మ్యాటర్ ఏమిటంటే జైలర్ 2 ఖర్చు విషయంలో నిర్మాత కళానిధి మారన్ అసలు కాంప్రమైజ్ అవడం లేదని, దీన్ని ఎంతో గ్రాండియర్ గా నిర్మించాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. 

అయితే  ఇటీవల కెజిఎఫ్ సిరీస్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా ఎంపికయినట్లు తెలుస్తోంది. అలానే ఫస్ట్ పార్ట్ లోని ప్రధాన పాత్రధారులు అందరు కూడా ఇందులో ఉంటారని, త్వరలో వారి వివరాలు అధికారికంగా వెల్లడవుతాయని అంటున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version