Home సినిమా వార్తలు Pushpa 2 OTT Getting Good Response పుష్ప 2  ఓటిటికి మంచి రెస్పాన్స్  

Pushpa 2 OTT Getting Good Response పుష్ప 2  ఓటిటికి మంచి రెస్పాన్స్  

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో రావు రమేష్, ఫహాద్ ఫాసిల్, సునీల్ అనసూయ, అజయ్ తదితరులు నటించారు.

ఇక ఈ మూవీలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద్భుత నటనకు అందరినీ ఆకట్టుకోవడం తోపాటు మూవీ ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించిన పుష్ప 2 మూవీ కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు పలు భాషల్లో మంచి కలెక్షన్ అందుకుంటూ కొనసాగుతున్న ఈ మూవీ ఇటీవల రూ. 1700 కోట్ల క్లబ్ లో చేరింది.

ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ యొక్క అభిమానాన్ని చూరగొంటూ మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. మొదటి వారంలోనే 5.8 మిలియన్ల వ్యూస్ తో నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 రికార్డు స్థాయిలో ప్రారంభం అయి ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో (ఇంగ్లీషేతర చిత్రాలు) మరియు భారతదేశం మరియు అనేక ఇతర దేశాలలో నంబర్ 1 స్థానంలో ఉంది. మొత్తంగా తమ మూవీ ఓటిటి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుండడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version