Dulquer Salman Kaantha with Intresting Concept ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో దుల్కర్ సల్మాన్ ‘కాంత’  

    kaantha

    యువ సక్సెసఫుల్ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచో జోరు మీదున్నారు. ఇటీవల వెంకీ అట్లూరితో ఆయన చేసిన లక్కీ భాస్కర్ మూవీ పెద్ద విజయం అందుకుని నటుడిగా ఆయన స్థాయిని మరింత పెంచింది. అలానే తెలుగులో అంతకముందు సీతారామం, ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నారు దుల్కర్. 

    ఇక తాజగా ఇప్పటికే వైజయంతి మూవీస్ సంస్థ పై నిర్మితం కానున్న ఆకాశంలో ఒక తార మూవీ అనౌన్స్ చేసిన దుల్కర్ మరోవైపు కాంత అనే మూవీ కూడా చేస్తున్నారు. ఈ రెండు డిఫరెంట్ జానర్ మూవీస్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, నిన్న కాంత మూవీ నుండి దుల్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. దీనికి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

    మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తుండగా రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆకట్టుకునే కథనాలతో కాంత తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ అయిన కాంత ఫస్ట్ లుక్ పోస్టర్ లో రిట్రో స్టైల్ సూట్ తో అదరగొట్టారు దుల్కర్. ఈ పోస్టర్ తో అందరిలో మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version