టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 అనౌన్స్ మెంట్ కోసం కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అందరూ కూడా ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెల్సిందే.
ఇక ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ కోసం ఇప్పటికే ఫుల్ గా క్రాఫ్, గెడ్డంతో పాటు బాడీ కూడా పెంచుతూ బల్క్ గా సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్. ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు టెస్ట్ షూట్ వేగంగా జరుగుతుండగా మరొకవైపు జక్కన్న అండ్ టీమ్ ఫస్ట్ షెడ్యూల్ కి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఇటీవల ఈ మూవీ టీమ్ లో జాయిన్ అయిన ప్రియాంక చోప్రా మూవీలో నెగటివ్ రోల్ చేస్తున్నారని, అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నెగటివ్ రోల్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
అలానే ఇతర ముఖ్య పాత్రధారుల ఎంపిక విషయమై కూడా టీమ్ కసరత్తు చేస్తోందట. భారతీయ సినిమా పరిశ్రమతో పాటు హాలీవుడ్ కి చెందిన పలువురు ముఖ్య నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. అలానే ఈ మూవీకి సంబంధించి మూవీ టీమ్ నుండి అనౌన్స్ మెంట్ టీజర్ కూడా రానుందట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.