యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా అందాల కధానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై యువ నిర్మాత బన్నీ వాసు దీనిని గ్రాండ్ గా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరిలో ఈ మూవీ మరింత మంచి క్రేజ్ ఏర్పరిచింది. కాగా ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ని ఇప్పుడు చూద్దాం
సినిమా పేరు: తండేల్
రేటింగ్: 3/5
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి, మరియు ఇతరులు
దర్శకుడు: చందూ మొండేటి
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2025
కథ :
ముఖ్యంగా తండేల్ కథ గురించి మాట్లాడుకుంటే, భారతదేశానికి చెందిన ఒక మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్ళినపుడు తప్పిపోయి పాకిస్తాన్ పోలీసులకు పెట్టుబడి అనంతరం మన దేశానికి చేరుకోవడం అనే విధంగా సాగుతుంది. ఆ విధంగా పాకిస్థాన్ పోలీస్లులకి చిక్కిన రాజు మరియు అతడి ప్రేయసి సత్య ల మధ్య సాగె ఎమోషనల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గా ఇది సాగుతుంది. మరి రాజు ని దక్కించుకోవడం సత్య చేసిన ప్రత్యత్నాలు ఏంటి, చివరికి రాజు ఏ విధంగా మన దేశానికి చేరుకున్నాడు అనేది మొత్తం సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా తండేల్ లో రాజు పాత్రలో అక్కినేని నాగచైతన్య యాక్టింగ్ ఎంతో బాగుంది. ఇక తరచు తన సినిమాల్లో అదరగొట్టే పెర్ఫార్మన్స్ కనబరుస్తూ నాటింగా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న సాయి పల్లవి ఈ మూవీలో సత్య పాత్రతో మరొక్కసారి అలరించారు. ఇక ఇతర కీలక పాత్రల్లో కనిపించిన ప్రకాష్ బెలవాడి, దివ్య పిళ్లై, కరుణాకరన్, మరియు మహేష్ ఆచంట తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు.
విశ్లేషణ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎంతో ఎంగేజింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా సత్య మరియు రాజుల మధ్య వచ్చే లవ్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మరీ ముఖ్యంగా ట్రైన్ స్టేషన్ సీన్ ఎంతో బాగుంటాయి. ఆ సీన్ లో హీరో హీరోయిన్స్ ఇద్దరి ఎమోషనల్ యాక్టింగ్ చాలా బాగుంది. అయితే ఈ విధంగా సాగె హృద్యమైన ఎమోషనల్ స్టోరీ లోకి పాకిషన్ అంశంతో కథ పేట్రియాటిక్ వే లో సాగుతుంది. ఒకరకంగా ఈ సందర్భంలో కొన్ని సీన్స్ అంతగా ఆకట్టుకోవు. హీరోతో పోటీగా నిలిచే విలన్ పాత్ర ఆడియన్స్ కి కొంత ఇరిటేషన్ తెప్పిస్తుంది. అలానే సాయి పల్లవి ఆజాది ఎపిసోడ్ ని మరింత బాగా రాసుకోవచ్చు. అయితే చివరి 20 నిముషాలు ఎమోషనల్ గా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
- నాగ చైతన్య మరియు సాయి పల్లవి పాత్రల చిత్రీకరణ
- ఫస్ట్ హాఫ్ లో ప్రధాన జంట మధ్య సన్నివేశాలు
- దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
- ప్రీ-క్లైమాక్స్ దగ్గర బోర్డర్ ఎపిసోడ్
- విజువల్స్
మైనస్ పాయింట్స్ :
- నెమ్మదిగా సాగడం
- అనవసరమైన దేశభక్తి సన్నివేశాలు
- కొన్ని అనుకూలమైన క్షణాలు
తీర్పు :
మొత్తంగా చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన లవ్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తండేల్ సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు తప్పించి మొత్తం సినిమా ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ పెర్ఫార్మన్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగున్నాయి.