Home సమీక్షలు ‘హరి హర వీర మల్లు’ రివ్యూ : మిస్ అయిన టార్గెట్ 

‘హరి హర వీర మల్లు’ రివ్యూ : మిస్ అయిన టార్గెట్ 

hari hara veera mallu

సినిమా పేరు: హరి హర వీర మల్లు: పార్ట్ 1 -స్వార్డ్ వర్సెస్ స్పిరిట్

రేటింగ్: 2 / 5

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్ మరియు
ఇతరులు

దర్శకుడు: జ్యోతి కృష్ణ – క్రిష్ జాగర్లమూడి

నిర్మాతలు: ఏఎమ్ రత్నం, ఎ దయాకర్ రావు

విడుదల తేదీ: 24 జూలై 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కించిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో బాబీ డియోల్, పూజిత పొన్నాడ, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేసారు. మరి నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఎంత మేర వారిని ఆకట్టుకుంది అనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం

కథ

1650లో జరిగే ఈ కథలో హరి హర వీర మల్లు (పవన్ కళ్యాణ్) ఒక రాబిన్ హుడ్ మాదిరిగా పెద్దలను కొట్టి పేదసాదలకు పెడుతుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో కొల్లూరు రాజు ద్వారా ఒక ఒప్పందం కుదుర్చుకుని పంచమి అనే యువతిని అక్కడి నుండి తప్పిస్తాడు.

అయితే ఆ విషయం తెలుసుకున్న కుతుబ్ షా (దలీప్ తహిల్) ఆశ్చర్యపోతాడు. అనంతరం అతడికి ఒక పెద్ద పని అప్పగిస్తాడు. అది ఏమిటంటే, ఔరంగజేబు నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం. మరి మొత్తంగా అతడు ఆ పనిని ఏవిధంగా  పూర్తి చేసాడు, ఆ సమయంలో ఎటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నాడు అనేది మొత్తం తెరపై చూడాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్

మరొక్కసారి ఈ మూవీ ద్వారా హరి హర వీర మల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో అటు ఫ్యాన్స్ ని ఇటు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అయన పలికిన పలు డైలాగ్స్ తో పాటు ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఎంతో బాగున్నాయి.

అయితే కొన్ని సీన్స్ లో ఆ పాత్రలో బలమైన ప్రభావం కనిపించదు. ఇక ఫస్ట్ హాఫ్ లో కనిపించే నిధి అగర్వాల్ తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకుంది. సత్యరాజ్, నాసర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి వంటి వారు తమ పాత్రలో ఒదిగిపోయారు.

అయితే వీరి పాత్రలు చిన్నవి కావడంతో బాగా పెర్ఫార్మ్ చేసేందుకు ఛాన్స్ లేదు. బాబీ డియోల్ తన ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయాడు అయితే ఆ పాత్ర అక్కడడక్క కొన్ని సీన్స్ లో మాత్రమే మనకు దర్శనమిస్తుంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. అయితే కీరవాణి నేపధ్య సంగీతంతో పాటు రెండు పాటలు ఆకట్టుకుంటాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు పర్వాలేదు. 

విశ్లేషణ

ముందుగా ఇటువంటి హిస్టారికల్ పీరియాడిక్ సినిమా తీసేటప్పుడు కథ తో పాటు కథనం కూడా బలంగా ఉండడంతో పాటు ఎమోషన్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా రాసుకుంటేనే అది ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. మొఘల్ సామ్రాజ్యంలో ప్రారంభం అయ్యే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించేలా సాగుతుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ఇంటర్వెల్ సహా పలు కీలక సీన్స్ బాగున్నాయి.

అయితే అక్కడక్కడా నెమ్మదించిన అనంతరం పులి మేక ఫైట్ తో పాటు పంచమి సీన్స్ ఫస్ట్ హాఫ్ లో అలరిస్తాయి. అయితే ప్రీ ఇంటర్వెల్ చార్మినార్ ఎపిసోడ్ ఆకట్టుకున్నప్పటికీ అక్కడి విఎఫ్ఎక్స్ మాత్రం ఆకట్టుకోదు.

అనంతరం కోహినూర్ ని తీసుకురావాలని వీరమల్లు డిసైడ్ అయ్యే సీన్ తో సెకండ్ హాఫ్ లో మంచి ఆసక్తి ఏర్పడుతుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు డొల్లగా ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగుతుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ మనల్ని ఏమాత్రం ఆకట్టుకోవు. ముఖ్యంగా అక్కడి నుండి వీర మల్లు పాత్రపై కూడా పూర్తిగా ఆసక్తి సన్నగిల్లుతుంది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోకపోగా పూర్తిగా వేగంగా నడిపించినట్లు అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ సీన్స్ చప్పగా సాగడంతో పాటు అసుర హననం సాంగ్ కూడా ఆకట్టుకోదు. ఇక కీలకమైన ఆంది సీన్ కూడా ఆకట్టుకోకపోగా పూర్తిగా డిజప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్ తో ఆడియన్స్ యొక్క సహనానికి పరీక్ష పెడుతుంది. 

ప్లస్ పాయింట్స్:

  • ప్రారంభ సన్నివేశాలు
  • ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్స్
  • ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో విరుద్ధమైన స్క్రీన్ ప్లే
  • పేలవమైన విఎఫ్ఎక్స్
  • కొన్ని చోట్ల దారుణమైన విజువల్స్
  • క్లైమాక్స్ అస్పష్టంగా ఉండడం

తీర్పు

మొత్తంగా పవన్ కళ్యాణ్ తో క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తీసిన హరి హర వీర మల్లు మూవీ ఇంటర్వెల్ వరకు ఆకట్టుకునే రీతిన సాగినప్పటికీ సెకండ్ హాఫ్ లో పూర్తిగా చప్పగా సాగడంతో పాటు దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఏమాత్రం ఆకట్టుకోకుండా సాగె సీన్స్ తో ఆడియన్స్ యొక్క సహనానికి పరీక్ష పెడుతుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version