సినిమా పేరు: 3BHK
రేటింగ్: 2.75 / 5
తారాగణం: సిద్ధార్థ్, శరత్ కుమార్, మీతా రఘునాథ్, దేవయాని, చైత్ర జె ఆచార్, యోగి బాబు తదితరులు
దర్శకుడు: శ్రీ గణేష్
నిర్మాత: అరుణ్ విశ్వ
విడుదల తేదీ: 4 జూలై 2025
సిద్దార్థ, శరత్ కుమార్, దేవుని వంటి నటులు కీలక పాత్రల్లో శ్రీగణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా మూవీ 3BHK. ఇటీవల ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి ఆసక్తిని ఏర్పరిచిన ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
కథ పరంగా చెప్పాలి అంటే ఒక మధ్యతరగతి కుటుంబం మతంగా ఒక 3BHK ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు తమ జీవితంలో
ఏవిధంగా ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కొంది అనే అంశం పై సాగుతుంది.
నటీనటులు పెర్ఫార్మన్స్ :
ముఖ్య పాత్ర చేసిన సిద్దార్థ మరొక్కసారి తన యొక్క ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసులు దోచారు. కీలకమైన ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన మరింత హృద్యంగా అందరి మనసులు తాకుతుంది.
ఇక శరత్ కుమార్, దేవయాని ల పాత్రలు కూడా బాగుంటాయి, వారి పెర్ఫార్మన్స్ కూడా మధ్యతరగతి తల్లితండ్రులుగా ఎంతో బాగా కుదిరింది. మీత రఘునాథ్, చరిత ఆచార్ కూడా తమ యొక్క పాత్రల్లో ఒదిగిపోయి యాక్ట్ చేసారు. కొన్ని కామెడీ సీన్స్ లో యోగి బాబు తన మార్క్ నవ్వులు పంచుతారు.
విశ్లేషణ :
మొదటగా 3BHK టీజర్ మనం చూసినప్పటి నుండి ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అనే హింట్ ని దర్శకుడు శ్రీగణేష్ ఇచ్చారు. ముఖ్యంగా నేటి మధ్యతరగతి వారికి సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది కలగానే ఉండిపోతోంది.
అటువంటి తరుణంలో ఒక మధ్యతరగతి కుటుంబం 3BHK ఫ్లాట్ కొనుగోలు చేయడంలో పడ్డ వేదన, ఆర్ధిక ఇబ్బందులు హృద్యంగా చూపించారు. సిద్దార్ధ స్కూల్ సీన్స్ ని వేగంగా చూపించినప్పటికీ ఫ్యామిలీ సీన్స్ సహజత్వానికి దగ్గరగా అనిపిస్తాయి.
ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మంచి ఆసక్తిని ఏర్పరిచే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వారి కుటుంబం పడే బాధలు, ముఖ్యంగా శరత్ కుమార్ పాత్ర తన ఆర్ధిక గమ్యాన్ని చేరుకునేందుకు పడ్డ వేదన మనల్ని కదిలిస్తాయి.
అలానే సిద్దార్ధ జాబ్ కోసం పడే తపన అక్కడి సమస్యలు సహజంగా ఆకట్టుకునే రీతిన తీశారు. క్లైమాక్స్ కి చేరుకునే కీలక సన్నివేశాలు బాగున్నాయి. అయితే మీత రఘునాథ్ పెళ్ళికి సంబందించిన సీన్స్ మరింత బలంగా రాసుకుని ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మన్స్
- సహజ భావోద్వేగాలు
- గుర్తించదగిన పాత్రలు / సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
- రొటీన్ సన్నివేశాలు
- కొన్ని సీన్స్ లో విసుగుగా అనిపిస్తాయి
తీర్పు :
మొత్తంగా సిద్దార్థ, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రల్లో శ్రీగణేష్ తీసిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ 3BHK ఒక నిజాయితీతో సాగె మూవీ అని చెప్పవచ్చు. అయితే చాలా వరకు సీన్స్ రొటీన్ గా కథనం సాగతీతగా అనిపిస్తుంది. అయితే ఆర్టిస్టుల నటన, ఎమోషనల్ సీన్స్ మనల్ని అలరిస్తాయి.